బీటీ రోడ్డు నిర్మాణం ఎప్పుడో.?

నరకప్రాయంగా కౌలూరు గ్రామం రోడ్డు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌలూరు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనల్లోనే నిలిచింది. పాలక ప్రజాప్రతినిధుల, నేతల, అధికారుల హామీలకే పరిమితమైంది.అసలే అంతంతమాత్రంగా ఉన్న మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల గోతులేర్పడి, బురదమయంగా మారింది. గ్రామస్తులు నిత్యం  ఈ రోడ్డు పై నరకయాతన పడుతున్నారు.కరకగూడెం మండలం కౌలూరు గ్రామానికి బీటీరోడ్డు నిర్మించాలని రవాణా సౌకర్యం కల్పించాలని  గ్రామాల ప్రజలు ప్రజాప్రథినిధులు, అధికారులను కోరుతున్నారు. గత ప్రభుత్వంలో మూడు కిలోమీటర్ల  బీటీ రోడ్డుకు  అధికారులు ప్రతిపాదనలు  చేశారు కానీ రోడ్డునుమధ్యలోనే వదిలేశారు . విధిలేక శుక్రవారం గ్రామస్థులే సొంత ఖర్చులతో రోడ్డు గుంతలు పూడ్చుకున్నారు. రోడ్డు నిర్మాణ విషయంలో ఉన్నతస్థాయి అధికారులు  ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ..

Facebook
WhatsApp
Twitter
Telegram