కుమార్తె చనిపోయింది.. వరకట్నం వెనక్కివ్వాలని నిరసన

గోల్డెన్ న్యూస్/ మంచిర్యాల :  తమ కుమార్తె మృతి చెందడంతో పెళ్లి సమయంలో ఇచ్చిన వరకట్నం తిరిగి ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన ఘటన రామకృష్ణాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా.. రామకృష్ణాపూర్ పట్టణం భగత్సింగ్నగర్కు చెందిన సింగరేణి కార్మికుడు ముద్దసాని సురేష్ వివాహం పట్టణానికి చెందిన లావణ్య(29)తో 2021లో జరిగింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో కొన్ని రోజులుగా లావణ్య పుట్టింట్లో ఉంటున్నారు. ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సత్యం, లావణ్య మృతి చెందారు. శుక్రవారం ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో తెచ్చి నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పడంతో అంత్యక్రియలు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram