బిఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తలకు కేటీఆర్ క్లారిటీ..
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో బిఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నాలు జరిగాయంటూ బిజెపి ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలపై ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తాము ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంతకాలం భారత రాష్ట్ర సమితి ఉంటుంది. టిఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని. మేము కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎరువుల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని . మరోసారి కెసిఆర్ సీఎం అయితే ప్రజల కష్టాలు తొలగిపోతాయని పేర్కొన్నారు
Post Views: 111