గుంతల మయం.. గుండెల్లో భయం !

ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో వాహనచోదకుల పాట్లు

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ :మణుగూరు  ఏటూరునాగారం రహదారి. ఈ పేరు వింటేనే ప్రజలు హడలిపోతున్నారు. కనీస మరమ్మతులు చేపట్టక గుంతల మయంగా మారి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై వెళ్లాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. రెండు వరుసల ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రోడ్డు పొడవునా అడుగుకో గుంత ఉండటంతో వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒక వాహనం ముందు వెళ్తుంటే ఆ వాహనాన్ని అధిగమించలేని పరిస్థితి నెలకొంది. బయ్యారం క్రాస్ రోడ్ నుంచి మణుగూరు  20 నిమిషాల్లో వెళ్లే వాహనాలు 40 నిమిషాల సమయం పడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ఏటూరు నాగారం రహదారికి అనుసంధానంగా ఉండటంతో నిత్యం  వేలది వాహనాలతో రద్దీ అధికంగా ఉంటోంది. ఏడూళ్ల బయ్యారం నుంచి  రోడ్డు పొడవు మొత్తం 12 కిలో మీటర్లు ఉండగా.. ఇటీవల కురిసిన వర్షాలకు విజయనగరం నుంచి మణుగూరు మధ్యలో 3 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి  గుంతల మయంగా మారింది కొన్ని చోట్ల అయితే మోకాళ్ళలోతు గుంతలు పడి వాటిల్లో నీరు నిలిచి ఉన్నాయి.  అయితే ఆర్ అండ్ బి అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రోడ్డుపై నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..

Facebook
WhatsApp
Twitter
Telegram