గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చాలా వరకు నిర్మాణం ప్రారంభించలేదు. కఠిన నిబంధనలు, విడుతల వారీగా నిధుల విడుదల, తక్కువ స్థల పరిమితి వంటి సమస్యలతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో హౌసింగ్ అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆగస్టు 15లోగా స్థలాల్లో ‘ముగ్గు’ (మార్కింగ్) పెట్టించకపోతే, ఇళ్ల అనుమతులను రద్దు చేసి ఇతరులకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం
Post Views: 123