గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి డా. జయలక్ష్మి తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న మందులు, వైద్యుల రికార్డులను . రక్త పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డి ఎం ఓ, ఫైజ్ మొహిద్దిన్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 235