గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మండల పరిధిలోని కలవలనాగారంలో బుధవారం కరకగూడెం ఎస్సై పీవీఎన్ రావు వాహనాల తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు మొదలుకావడంతో కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఇతర ప్రాాంతాా నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేప కరక కూడాట్టారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు తమ ఉనికి కోసం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా కట్టడి చేయాలనే లక్ష్యంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అనుమానితులపైనా పోలీసులు నిఘా పెట్టారు. వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Post Views: 337