విద్యుదాఘాతంతో యువకుడి మృతి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భట్టుపల్లి పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన బిలపాటి నరేందర్ (18) సోమవారం  పొలంలో మోటార్ వేయడాని కి వెళ్ళాడు విద్యుత్తు సరఫరా కావడం లేదని కరెంట్ తీగను ఆనుకొని ఉన్న  ఫెన్సింగ్ ను పరిశీలిస్తుండగా తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు  తెలిపారు.

విద్యుత్ షాక్కు గల కారణాలను దర్యాప్తు  చేస్తున్నట్లు కరకగూడెం ఎస్సై చెప్పారు

Facebook
WhatsApp
Twitter
Telegram