కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండల పరిధిలోని  భట్టుపల్లికస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిని కూరగాయల నిల్వలను పరిశీలించారు. పాఠశాల విద్యార్థినీలతో మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలకు మేను ప్రకారం నాణ్యమైన భోజనాలు అందించాలని కు సూచించారు. బోధన విధానం, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల పాఠన శైలి తదితర అంశాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలోని డైనింగ్ హాల్, వసతి గదులు, ఫర్నిచర్, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలపై పరిశీలించాలి. స్పెషల్ ఆఫీసర్  డి. శ్రీదేవి పిలిపించి, వసతి, ఆరోగ్య పరిరక్షణ, టాయిలెట్లు, నీటి వసతి, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు వంటి మౌలిక సదుపాయాలను మరింత  పరచాలని సూచించారు. అదేవిధంగా కరకగూడెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక నవోదయ పాఠశాలను కూడా కలెక్టర్ సందర్శించారు.  ఆ పాఠశాలలోని వసతులను పరిశీలించారు త్వరలోనే పాఠశాల ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల, తహసీల్దార్ గంట ప్రతాప్, డిప్యూటీ తహసీల్దార్ వట్టం కాంతారావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పి. కృష్ణ ప్రసాద్ , ఎఇ శ్రీనివాస్ , ఎంపీవో  మారుతి యాదవ్ , గ్రామ సెక్రటరీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram