బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గువ్వల బాలరాజు

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ :  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆయన వచ్చే ఆదివారం (10వ తేదీ) ఉదయం 10 గంటలకు బీజేపీ పార్టీని చేరనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన బాలరాజు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నేను ఎంతో కష్టపడి బీఆర్ఎస్ పార్టీ జెండాను చెట్టు కు, పుట్టకు, ఇంటికి తీసుకెళ్లాను. అదే తీరులో ఇప్పుడు బీజేపీ జెండాను కూడా ఇంటింటికి తీసుకెళ్తాను” అన్నారు అన్ని కోణాలనూ పరిశీలించిన తర్వాతే బీజేపీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. బీజేపీ మంచి విధానాలతో ముందుకు సాగుతుండటమే తనను ఆకర్షించిన ముఖ్య కారణమని వెల్లడించారు. “ఎవరెన్ని మీటింగ్‌లు పెట్టుకున్నా నాకు పోయేది ఏమీ లేదు. నేను ఒక్కో ఇటుకలా నేనేదైతే నిర్మించానో, అదే స్థైర్యంతో ఇప్పుడు బీజేపీని బలోపేతం చేస్తాను. నల్లమల్ల ప్రాంతంలో కమలం జెండాను ఎగురవేస్తాను” అని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram