తాను పాముకు జన్మనిచ్చానంటూ మహిళ హల్చల్.. చివరికి!

ఉత్తరప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఖజురహోలోని మౌమాసానియా గ్రామంలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తాను పాము పిల్లలకు జన్మనిచ్చానంటూ అందరినీ బెంబేలెత్తించింది. ఆ గ్రామంలోని ప్రజలంతా అక్కడికి చేరి వాస్తవం ఏమిటా అని తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఐతే ఆ పాము పిల్లల్ని ఎవరైనా చూస్తే చచ్చిపోతారని చెప్పింది. ఆ మహిళ దగ్గర పాము పిల్ల లాంటిది కనిపించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఆ పాములను ప్రస్తుతం తను ఓ డబ్బాలో పెట్టాననీ, ఎవ్వరూ చూడొద్దని చెప్పడంతో స్థానికులు భయపడిపోయారు. విషయాన్ని సమీపంలోని పోలీసులకు తెలియజేయడంతో, వారు కాస్తా అక్కడి వైద్యులకు సమాచారం ఇచ్చారు.దాంతో వైద్యులు రంగంలోకి దిగారు. వారి దర్యాప్తులో మొత్తం నిజం బయటపడింది. పాము పిల్లలు అని పిలవబడుతున్నవి పాము పిల్లలు కాదని స్పష్టం చేసారు. కొంతమందిలో అరుదుగా బహిష్టు సమయంలో తీగలా రుతుస్రావం జరుగుతుందనీ, ఈ మహిళ విషయంలో కూడా అలాగే జరిగిందని తేల్చారు. అలా తీగలా వచ్చిన బ్లడ్ క్లాట్స్ చూసి సదరు మహిళ భయపడిపోయి వాటిని పాము పిల్లలు అనుకున్నదని వైద్యులు తెలియజేసారు. ఇలాంటి వార్తలు ఎవ్వరూ నమ్మవద్దని చెప్పారు.

ఒక మహిళ పాముకు జన్మనివ్వడం అసాధ్యమన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram