గోల్డెన్ న్యూస్ / నిర్మల్ / రాఖీ పౌర్ణమి రోజున నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాఖీలు కొనడానికి వెళ్లిన అన్నాచెల్లెళ్లు రోడ్డుప్రమాదానికి గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. లోకేశ్వరం నుంచి మహేశ్, అతడి చెల్లెళ్లు అర్చన, ఆద్య కలిసి రాఖీల కోసం సోఫీనగర్కు వెళ్తుండగా చిట్యాల బ్రిడ్జ్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేశ్, అర్చనలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Post Views: 48









