కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి రైతు వేదికలో లబ్ధిదారులకు 904 మందికి కొత్త రేషన్ పంపిణి చేశారు . అదేవిధంగా 15 నంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో తాసిల్దార్ గంట ప్రతాప్ గారు, ఎన్టీఆర్ మారుతి, సివిల్ సప్లయిస్ DT శివకుమార్, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ కుమార్,మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్ గారు, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram