10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
గోల్డ్ న్యూస్ /ప్రకాశం / దోర్నాల వద్ద నల్లమల్ల ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓ బస్సు డ్రైవర్ కేబిన్లో చిక్కుకుపోయారు. అతి కష్టం మీద ఆయన్ను బయటకు తీశారు . స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణీకులు గాయాలపాలైన డ్రైవర్, ప్రయాణీకులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రమాదం జరిగి మూడు గంటలైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో, భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని వాహనదారుల ఆగ్రహం
Post Views: 23