మళ్లీ పులి అలజడి.

అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న అటవీశాఖ అధికారులు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పరిధిలోని గ్రామాల ప్రజలకు అటవీశాఖ అధికారులు పలు సూచన చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల అడవుల్లో పెద్దపులి సంచరించినట్టు  అక్కడి అటవీ శాఖ అధికారులు తెలిపారు, కరకగూడెం మండలంలోనికి పులి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల అటవీ పరిసర ప్రాంతాల ప్రజలు. మరియు అడవిలోకి వెళ్లే పశువుల కాపరులు,మేకల కాపరులకు అప్రమత్తంగా ఉండాలని  హెచ్చరించారు.. గతేడాది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాషాల్లో కరకగూడెం మండలంలోని గొల్లగూడెం నార్త్ బీట్ కంపార్టుమెం ట్ -2 పంగల్వాగులో పెద్దపులి పాదముద్రలను మండల అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మళ్లీ ఆ ప్రాంతాల్లో పులి సంచరించవచ్చని వారు అభిప్రాయపడ్డారు..

Facebook
WhatsApp
Twitter
Telegram