విద్యుదాఘాతంతో తండ్రి కుమారులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్ల సందులాపూర్ లో జరిగింది.
గోల్డెన్ న్యూస్ / సిద్ధిపేట / జిల్లాలోని సందులాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడేందుకు పొలంలో వైర్లు కడుతుండగా విషాదం సంభవించింది. ఈ క్రమంలో రక్షణ వైరు అనుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో రైతు గజేందర్ రెడ్డి, కుమారుడు రాజేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాకాలంలో రైతులు పొలాల వద్ద పని చేసే సమయంలో విద్యుత్ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు
Post Views: 26









