సింగరేణి ఓపెన్ కాస్ట్ ల వల్ల పర్యావరణానికి, ఈ ప్రాంత ప్రజలకు నష్టం. సింగరేణి కి, ప్రభుత్వానికి లాభం.
భూగర్భ గనుల వల్ల పర్యావరణానికి, ప్రజలకు లాభం,సింగరేణి కి, ప్రభుత్వానికి నష్టం.
ఆర్. మధుసూదన్ రెడ్డి, సిపిఐ ఎంఎల్, మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు / సింగరేణి ఓపెన్ కాస్ట్ ల వల్ల పర్యావరణానికి, ఈ ప్రాంత ప్రజలకు నష్టమని, సింగరేణి కి, ప్రభుత్వానికి లాభమని, భూగర్భ గనుల వల్ల పర్యావరణానికి, ప్రజలకు లాభం అని, సింగరేణి కి ప్రభుత్వానికి నష్టం అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కాస్ట్ విస్తరణ పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ ల వల్ల భూములు కోల్పోయి రైతుల ఉపాధి కోల్పోవడమే కాక, దానిమీద ఆధారపడిన వ్యవసాయ కూలీల ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. సహజ అడవులు కోల్పోయి, భూగర్భ జలాలు అడుగంటి, దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యాల పాలవుతారు అన్నారు. . పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు.ఓపెన్ కాస్ట్ ల వల్ల సింగరేణి కి, ప్రభుత్వానికి మాత్రం కోట్ల రూపాయల లాభాలు వస్తాయన్నారు. భూగర్భ గనుల వల్ల భూములకు, రైతుల, కూలీల ఉపాధికి, సహజ అడవులకు, భూగర్భ జలాలకు, పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యాలకు ఎలాంటి నష్టం ఉండదు అన్నారు. సింగరేణికి, ప్రభుత్వానికి మాత్రం కోట్ల రూపాయల లాభాలు రావు అన్నారు. సింగరేణి కి గాని, ప్రభుత్వానికి గాని ప్రజల ప్రయోజనాల కన్నా లాభాలే ముఖ్యం కాబట్టి ఓపెన్ కాస్ట్ ల వైపే మొగ్గు చూపుతాయి అన్నారు.
విశాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మణుగూరు ఓసి విస్తరణకు రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వారికి మెరుగైన ప్యాకేజీ ఇచ్చి, వారికి కావలసిన మౌలిక వసతులు కల్పించి, వారు కోరుతున్న డిమాండ్లను పరిష్కరించి, పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









