గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా ను ప్రభుత్వం హెల్త్ హెమెర్జెన్సీ గా వెంటనే ప్రకటించాలని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర అన్నారు అన్నారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు మలేరియా,వైరల్ పివర్ లతో బాధపడుతున్నారని దాదాపు అన్ని ఏరియా వైద్యశాల, వివిధ పీహెచ్ సీ లో కలిపి దాదాపు 1000 మంది జ్వర పీడితులు ఉన్నప్పటికీ 60 నుండి 100 మలేరియా కేసులు ఉన్నాయని చూపిస్తున్నారని, సరియైన చికిత్స సదుపాయం లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , సిబ్బంది చేయడం లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో వెంటనే దోమ తెరలు, మలేరియా నిరోధక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఆదివాసి ఐకాస నాయకులు చీమల ప్రమీల, వజ్జ శ్రీను, పడిగా ప్రశాంత్, వాసం అంజి బాబు, చుంచు బాలరాజు, బత్తుల విజయ తదితరులు పాల్గొన్నారు









