కోయతూర్ కొత్తల పండుగ

కోయతూర్ సంస్కృతి – సాంప్రదాయ పండుగ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామంలో ఆదిమూలవాసులైన పూర్వ పెద్దల ఆనవాయితీ ప్రకారం, కోయ ఆదివాసీ సంస్కృతి–సాంప్రదాయ ప్రతిబింబంగా ఈ రోజు (ఆగస్టు 24, ఆదివారం) మగమొదటి పాదం సందర్భంగా, ప్రత్యేక పండుగ —సామే కొత్తల (పొట్ట పండుగ)ను పోలెబోయిన, పులి వంశం వారు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సమ్మక్క (ముసలమ్మ) ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా, సంప్రదాయ నృత్యాలు, గట్టు గోత్రాల ఆచారాలు, తాళమేళ మద్దెలతో కూడిన కోయతూర్ సంప్రదాయ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రకృతి సిద్ధమైన వరి, సామ కంకులతో జిబిలి నార తోరణాల అలంకరణ చేయగా, ఆలయం పండుగ వాతావరణంతో నిండిపోయింది.

కోయ ఆదివాసీల జీవన విధానానికి మూలమైన ప్రకృతి పూజ, పంటల పట్ల కృతజ్ఞతా భావం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల మార్గదర్శనం ఈ పండుగలో ప్రతిబింబించాయి.

కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోలెబోయిన బాబు, పోలెబోయిన వెంకటయ్య, పోలెబోయిన సత్యం, పోలెబోయిన లక్ష్మయ్య, పులి నారాయణ, పులి రామూర్తి, పోలెబోయిన సారయ్య, లక్ష్మయ్య, పులి రామకృష్ణ, సమ్మయ్య, గొంది బాలకృష్ణ, రవి, సోలం కృష్ణ పాల్గొన్నారు.

యువత తరఫున పోలెబోయిన రాంగోపాల్, పోలెబోయిన కార్తీక్, పోలెబోయిన రాజు, సిద్దు, పేరంటాం పోలెబోయిన మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram