గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బహిరంగ ప్రదేశంలో జరిగిన ఘటనలకే SC, ST చట్టం వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ప్రైవేటు సంభాషణలు, వాట్సాప్/మెయిళ్లలో కులదూషణ చేశారన్న ఆరోపణలకు వర్తించదని స్పష్టం చేసింది. మాజీ భార్య, ఆమె తండ్రి గతంలో వాట్సాప్, మెయిల్లో దూషించారని ఓ వ్యక్తి పెట్టిన కేసును హై కోర్ట్ విచారించింది. ప్రత్యక్ష సాక్షులు లేరని, బహిరంగ ప్రదేశంలో దూషించినట్లు ఆధారాలు లేవని కేసును కొట్టి వేసింది
SC, ST చట్టం ప్రధాన లక్ష్యం దళితులు, గిరిజనుల సమాజంలో బహిరంగంగా ఎదుర్కొంటున్న అవమానాలు, అణచివేత నుండి వారిని రక్షించడం. కేవలం ప్రైవేటు సంభాషణలలో జరిగే సంఘటనలకు ఈ చట్టాన్ని వర్తింపజేస్తే, దాని అసలు ఉద్దేశ్యం దెబ్బతింటుందని కోర్టు భావించింది
Post Views: 69









