లక్నవరం సరస్సుకు మరపడవల తరలింపు

గోల్డెన్ న్యూస్ / వెంకటాపురం : గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు గత జూలైలో ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెంకటాపురం, వాజేడు సహా పలు మండలాలకు రెండు చొప్పున మర పడవలను అందుబాటులో ఉంచారు. మండల పరిషత్ కార్యాలయాల వద్ద సిబ్బందితో పాటు సిద్ధంగా ఉంచిన ఈ పడవలు, ఈసారి వరదలు సంభవించక పోవడంతో వినియోగం లేకుండా పోయాయి. దీంతో సోమవారం వెంకటాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న రెండు మర పడవలను జెసిబి సహాయంతో లారీలో ఎక్కించి, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు టూరిజం శాఖకు తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram