రీల్స్ కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకున్న పర్యాటకుడు.

ముత్యంధార జలపాతం వద్ద తప్పిపోయిన యువకుడు

రాత్రంతా అడవిలో గాలించి సురక్షితంగా కాపాడిన ఫారెస్ట్ శాఖ అధికారులు.

గోల్డెన్ న్యూస్ /  ములుగు :  వెంకటాపురం (నూగూరు ) ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని, వీరభద్రవరం, ముత్యంధార జలపాతల పర్యటకుల సందర్శన లను అటవీ శాఖ నిషేధించింది. వీరభద్రారం వద్ద అడవికి వెళ్లే మార్గాలను మూసివేసి ఫారెస్ట్ శాఖ కాపలాతో పాటు నిఘాను ఏర్పాటు చేసి సిబ్బందితో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన అడవిలో ఉన్న జలపాతాన్ని పట్టణ ప్రాంత యువకులు ఫారెస్ట్ శాఖ అధికారుల సిబ్బంది కళ్ళు కప్పి దొంగ దారిన సందర్శించడానికి వెళ్లి అడవిలో తప్పిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ నగరానికి చెందిన అబ్రర్ హుస్సేన్ అనే యువకుడు, వీరభద్రవరం నిషేధిత ముత్యంధార జలపాతానికి సోమవారం ఒక్కడే వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కాలుజారి బండలపై పడటంతో స్వల్పంగా గాయపడ్డాడు. అప్పటికే బాగా చీకటి పడటంతో అడవిలో నుండే డయల్ 100 కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఫారెస్ట్ డివిజనల్ అధికారి ధ్వాలియా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. వంశీకృష్ణ,  సెక్షన్ ఆఫీసర్లు బీట్ ఆఫీసర్లు సిబ్బందిని అప్రమత్తం చేశారు. తప్పిపోయిన యువకుడు అబ్రర్ హుస్సేన్ ఫోన్ లొకేషన్ ఆధారంగా చీకట్లో అడవిలో సిబ్బంది తెల్లవారులు గాలింపు చేశారు. చివరకు మంగళవారం వేకువజామున తప్పిపోయిన పోయిన వరంగల్ యువకుడు సురక్షితంగా వెంకటాపురం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు తరలించారు. ప్రధమ చికిత్స నిర్వహించి యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సెక్షన్ ఆఫీసర్లు దేవయ్య, శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు పవన్ హర్ష, పాలెం బీట్ ఆఫీసర్ శేషు, బేస్ క్యాంప్ సిబ్బందిని, తప్పిపోయిన యువకుడిని క్షేమంగా బయటికి తీసుకు రావడం పట్ల పలువురు అభినందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram