గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మెహదీపట్నం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రయాణికులు ఎవరూ లేని సమయంలోనే ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.
సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం బస్సు స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్ దాన్ని పక్కకు నిలిపి మరమ్మత్తులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Post Views: 33









