లోయర్ మానేరు డ్యాంలో వలకు చిక్కిన భారీ చేప

గోల్డెన్ న్యూస్/ కరీంనగర్ : లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం (ఆగస్టు 25) తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూన సంపత్ అనే జాలరికి చిక్కింది ఈ భారీ చేప.లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో చేపలు పడుతుండగా వలకు భారీ సైజులో చేప చిక్కినట్లు జాలరి సంపత్ చెప్పాడు. ఎల్ఎండీలో చాలా సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నామని, కానీ ఎప్పుడు ఇంత పెద్ద చేప వలకు చిక్కలేదని సంతోషం వ్యక్తం చేశాడు సంపత్.

Facebook
WhatsApp
Twitter
Telegram