రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.

గోల్డెన్ న్యూస్ /వరంగల్ : కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత… 32 కిలోలు స్వాధీనం చేసుకున్న జీఆర్పీ పోలీసులు.

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమ రవాణా… ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడ్డ ముఠా.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.16 లక్షలు… ముగ్గురు నిందితుల అరెస్ట్.

అరెస్టయిన వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ… అందరూ ఒరిస్సా వాసులుగా గుర్తింపు.

లగేజీ బ్యాగుల్లో పొట్లాలుగా మార్చి తరలిస్తున్నట్లు వెల్లడించిన కాజీపేట జీఆర్పీ సీఐ వడ్డే నరేష్ కుమార్.

ఈ ముఠాకు చెందిన మరో ఇద్దరు కీలక నిందితులు పరారీ… వారి కోసం కొనసాగుతున్న గాలింపు.

నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు… జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు.

Facebook
WhatsApp
Twitter
Telegram