గోల్డెన్ న్యూస్/ పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు ఏడుళ్ల బయ్యారం ఎస్ ఐ, మరియు సిబ్బంది, ఒడిస్సా నుండి హైదరాబాద్ కీ గంజాయి తరలిస్తుండగా ఒక వ్యక్తి పల్సర్ మీద ఎస్కార్ట్ గా వస్తుండగా మరొక 4 గురు వ్యక్తులు 3 కార్ల డిక్కీలలో గంజాయి 50 పేజీల(రూ . 25,00,000/-) లను అక్రమ రవాణా చేస్తుండగా పెంటన్నగూడెం క్రాస్ రోడ్ వద్ద వద్ద పట్టుకొవడం జరిగింది, వారి వద్ద నుండి 50 కేజీల గంజాయి, 3 కార్లు, ఒక పల్సర్ బైక్, 8 ఫోన్లు,ఒక లాప్టాప్ సీజ్ చేయడం జరిగింది,కేసు నమోదు ఐదుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
Post Views: 338









