గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కార్మికులను యాజమాన్యాలు శ్రమ శ్రమ దోపిడీ చేస్తున్నాయని చేస్తున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఐటియు అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట షాప్ ఎంప్లాయీస్, పెట్రోల్ బంక్ వర్కర్స్, గ్రామ పంచాయతీ కార్మికులు, బేకరీ కార్మికులు, స్వచ్ఛమిత్ర కార్మికులు, ఆటో డ్రైవర్లు, క్యాజువల్ కార్మికులు, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రంగాల్లో రోజువారి వేతనంతో పని చేస్తున్న కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు అతి తక్కువ వేతనాలతో జీవితాన్ని వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల నుండి వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికుల వద్ద సమగ్ర సర్వే నిర్వహించామని ఈ సర్వేలో యాజమాన్యాలు 12 గంటలు పని చేయిస్తున్నట్లు, సరైన వేతనం ఇవ్వకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయన్నారు. కనీస సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలకు రెస్ట్ రూమ్ లు, వాష్ రూమ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకుండా రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తుండడంతో నెలవారి ఈఎంఐలు, అప్పులు ఎలా కట్టాలో అర్థం కాని పరిస్థితి కార్మికుల్లో నెలకొందన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం లేక అనారోగ్య పాలవుతున్న కార్మికులను సంబంధిత యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని తెలిపారు.
నెలలో 30 రోజులు పని చేస్తున్నారని, ప్రతి ఆదివారం వేతనంతో కూడిన సెలవులు కూడా ఇవ్వడం లేదని, యాజమాన్యాలపై సంబంధిత కార్మిక శాఖ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతో కార్మికుల శ్రమను దోచుకుంటున్న దృష్టి సాధించి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కార్మిక శాఖాధికారికి వినతి పత్రం అందజేశారు.









