ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు రాత్రి 2గంటల సమయంలో అడ్డాకుల వద్ద ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ హసన్ (35),అస్రాఫ్ ఉన్నిసా (70), ఎల్లమ్మ (40), మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram