ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి.

నష్టపోయిన పేదలకు  పరిహారం, పునరావాసం  కల్పించాలి

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్, పరిసర ప్రాంతాల్లో ముంపునకు గురైవుతున్న ప్రాంతాలను గుర్తించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అధికారులను కోరారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ఎస్ సి బి నగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం సిపిఐ ప్రతినిధిబృందం పర్యటించింది. బాధిత ప్రజలను కలుసుకొని జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సమాచారం ఇచ్చి ప్రభావిత ప్రాంతాలకు రప్పించి పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ భారీవర్షాలతో అంతర్గ రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ స్తంబాలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, దీంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని,సమస్యను స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని దృష్టికి తీసుకెళ్లామని, అత్యవస నిధులు మంజూరు చేయించి ముంపుసమస్యని పరిష్కరించేందుకు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాబీర్ పాషా వెంట నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, మునిగడప వెంకటేశ్వర్లు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సందెబోయిన శ్రీనివాస్, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram