కవిత పై చర్యలు కష్టమేనా

కవిత ప్రెస్మీట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఆమెను సస్పెండ్ చేయాలన్న డిమండ్ వినిపించింది. హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేయడంతో ఆమె చాలా డ్యామేజ్ చేశారని అనుకుంటున్నారు. ఏ క్షణమైనా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న హడావుడి ప్రారంభించారు.కానీ కేసీఆర్ రాజకీయాన్ని డీకోడ్ చేసిన వారికి మాత్రం.. అలాంటి నిర్ణయం ఎప్పటికీ రాదని గట్టి నమ్మకంతో ఉన్నారు. హరీష్ రావు కోసం కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉండవని వారందరికీ తెలుసు.

 

అయితే కవితకు వ్యతిరేకంగా మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం చేయిస్తున్నారు. ఆమె పీఆర్వోలను పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పించారని…అన్ని కమ్యూనికేషన్లు కట్ అయ్యాయని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె కొత్త పార్టీ పెట్టుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న పుకారు కూడా ప్రారంభించారు.కానీ అదంతా కవితపై చర్యలు తీసుకోవడానికి చేసిన కసరత్తే. కేసీఆర్ కు ఈ రాజకీయాలన్నీ తెలుసని అంటున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram