కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది ఎమ్మెల్యే పల్లా హాట్ కామెంట్స్

కవిత సస్పెన్షన్‌పై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే కవితపై సస్పెన్షన్ వేటు పడిందని అన్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు ఎవరు నష్టం చేకూర్చినా ఇలాంటి చర్యలే ఉంటాయని అన్నారు. కేసీఆర్‌కు కొడుకు, అల్లుడు, బిడ్డా అంతా సమానమేనని తెలిపారు. కవిత పార్టీ నుంచి పోయినంత మాత్రానా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్రంలో తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని, కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చిల్చేందుకు కుట్రలు చేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram