పాత కలెక్టర్ గెజిట్ ప్రకారమే వేతనాలు చెల్లించాలి పెండింగ్ వేతనాలు చెల్లించాలి హాస్టల్ డైలీ వర్కర్లను రెగ్యులర్ చేయాలి సమ్మె నోటీస్ అందజేసిన సిఐటియు
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు ఇచ్చే వేతనాల్లో జీవో నెంబర్ 64 నిలిపివేసి పాత కలెక్టర్ గెజిట్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని, ఇదివరకు పెండింగ్లో ఉండబడిన వేతనాలు తక్షణమే చెల్లించాలని, డైలీ వేస్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు హాస్టల్ డైలీ వేస్ వర్కర్ల సమస్యలు మరింతగా జటిలమవుతున్నాయని ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమవుతుందని వారన్నారు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం జీవో నెంబర్ 64 ద్వారా కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందని వారన్నారు కలెక్టర్ గెజిట్ ప్రకారం చెల్లిస్తున్న వేతనాలు జీవో నెంబర్ 64 ద్వారా చెల్లిస్తే వేతనాలు సగం వరకు తగ్గే అవకాశం ఉందని వారన్నారు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్న వేతనాలు ఉన్నఫలంగా జీవో నెంబర్ 64 ద్వారా తగ్గిస్తే కార్మికులు కుటుంబం గడిచే పరిస్థితి లేక ఆర్థిక మానసిక ఇబ్బందులకు లోనవుతారని వారన్నారు ప్రభుత్వం దృష్టి సారించి జీవో నెంబర్ 64 అమలును నిలిపివేయాలని, కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని ఎడల నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు అనంతరం హాస్టల్ వార్డెన్ కు సమ్మె నోటీసు అందజేశారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వర్కర్లు కొమరం ముసలయ్య, ఏడుల్ల పాపయ్య, చర్ప నరసింహారావు, చంద్రకళ, నాగమణి తదితరులు పాల్గొన్నారు









