మెడికల్ కాలేజ్ బాత్రూం లో యువతీ యువకుడు.

బుర్ఖా ధరించి లేడీస్ బాత్రూమ్ లోకి వెళ్లిన వ్యక్తి.

 

కరీంనగర్ శివారులోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో బుర్ఖాలో వచ్చిన ఓ వ్యక్తి లేడీస్ బాత్రూమ్ కి దూరడం కలకలం రేపుతోంది. అతడితో పాటు స్కార్ఫ్ ఉన్న మరో మహిళను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. వారి బుర్జా, స్కార్ఫ్ తొలగించడంతో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ అని తేలింది. ఈ జంట దొంగతనానికి వచ్చారా, లేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటానికి ప్రయత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..!!అనుమానాస్పదంగా ప్రవర్తన

 

వారిద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని..

అందువల్లే వారిని అనుసరించాల్సి వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. సీసీ కెమెరాలలో పరిశీలించగా వారిద్దరు సంకేతాలు ఇచ్చుకుంటున్నారని.. అందువల్లే వారిద్దరని అనుసరించాల్సి వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులకు సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఏం తేలుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ మెడికల్ కాలేజీలో వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే సంఖ్యలో రోగులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇది బోధనా ఆస్పత్రి కావడంతో జరిగిన సంఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram