ఎమ్మెల్యే పాయం కు ఘన స్వాగతం పలికిన పాత్రికేయుల సంక్షేమ సంఘం సభ్యులు.
గోల్డెన్ న్యూస్ /పినపాక: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగాపనిచేస్తూ నిత్యం సమాజానికి నూతన విషయాలను తెలియజేసే కీలక పాత్ర జర్నలిస్టులు పోషిస్తున్నారని పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో పినపాక పాత్రికేయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులను శాలువుతో సత్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగాపనిచేస్తూ నిత్యం సమాజానికి నూతన విషయాలను తెలియజేసే కీలక పాత్ర జర్నలిస్టులు పోషిస్తున్నారని అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ డే వేడుకల కార్యక్రమంలో పాల్గొనడం సీనియర్ జర్నలిస్ట్ లను సన్మానించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు సమాజంలో నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే ఎంతోమంది జర్నలిస్టులు ఆణిముత్యాలుల పని చేస్తున్నారని తెలియజేశారు, జర్నలిస్టులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ను పత్రికేయ సంక్షేమ సంఘం ప్రెస్ క్లబ్ పినపాక సభ్యులు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో సునీల్ శర్మ , ఎంఈఓ నాగయ్య , సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిషాల రామనాథమ్, జానంపేట మెడికల్ ఆఫీసర్ శృతి, జర్నలిస్టులు- సనప భరత్ రెడ్డి, కీసర సుధాకర్ రెడ్డి, తోట గంగాధర్ బిల్లా నాగేంద్ర శ్రీరామ్ బృహస్పతి మహేష్ రెడ్డి ముక్కు మహేష్ రెడ్డి కట్ట శ్రీను, బుయ్యవరపు భాస్కర్, బోల్లి నరేష్, బూర శంకర్,పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.










