ఉత్తరప్రదేశ్ లోని సూరజ్ పూర్ లో మంచంపై నిద్రపోతున్న 2 నెలల బాలుడిని కోతి ఎత్తుకెళ్లి, ఇంటి మేడపై నీటితో ఉన్న డ్రమ్ములో పడేసింది.
ఈ ఘటనలో శిశువు మృతి చెందాడు. బాలుడి తల్లి స్నానం చేయించి, మంచంపై పడుకోబెట్టింది.
అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన కోతి, బాలుడిని ఎత్తుకెళ్లింది.
శిశువు ఆచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులకు డ్రమ్ములో మృతదేహం కనిపించింది.
పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే బాలుడి అంత్యక్రియలు పూర్తి చేసిన తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Post Views: 33









