పబ్లిక్ పల్స్ బాగా పట్టేసిన సీఎం రేవంత్

పబ్లిక్‌తో ఎలా ఉండాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదమో ?. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో పలు కాలనీల్లోకి ప్రోటోకాల్ లేకుండా వెళ్లిపోయినప్పుడు అందరూ పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. కానీ ఆయన అక్కడి వరకూ వెళ్లే వరకూ ఉన్నతాధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. ఇప్పుడు గణేష్ నిమజ్జలనాల సమయంలోనూ ఆయన అదే విధంగా పబ్లిక్ ను ఆశ్చర్యపరిచారు.

 

ఎలాంటి ప్రోటోకాల్.. అధికారిక వాహనాలు లేకుండా నేరుగా ట్యాంక్ బండ్ మీదకు సీఎం వచ్చేశారు. నిజానికి నిమజ్జనాల సమయంలో సీఎం అక్కడికి వస్తున్నారంటే ఉండే గందరగోళం సంగతి చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడతారు. కానీ ఎలాంటి సమస్యలు రాకుండా ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం పూర్తి అయిన తర్వాత.. సాధారణ భక్తుడిలా ట్యాంక్ బండ్ మీదకు వచ్చారు. గణపతి బప్ప మోరియా నినాదాలు చేశారు. భక్తులను ఉత్సాహపరిచారు. విధుల్లోఉన్న వారిని అభినందించారు.

 

రేవంత్ రెడ్డి ఇలా రావడం వల్ల భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఏర్పాట్లు బాగున్నాయి. సీఎం కూడా అటెన్షన్ చూపించారు. ఇలా చేయడం సీఎం రేవంత్ కు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆయన సింప్లిసిటీని అందరూ ఇష్టపడతారు. ఎలా చూసినా పబ్లిక్ పల్స్ బాగా పట్టిన సీఎం అని చెప్పుకోవచ్చు

Facebook
WhatsApp
Twitter
Telegram