చంద్రగ్రహణంపై అపోహలు, వాస్తవాలు, శాస్త్రీయ అవగాహనపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సదస్సు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం: చంద్ర గ్రహణం ఏర్పాటుతున్న నేపథ్యంలో అపోహాలు వాస్తవాలు శాస్త్రీయ అవగాహనపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ డాక్టర్ లింగంపల్లి దయానంద్ ప్రసంగించారు సదస్సులో వారు మాట్లాడుతూ ఖగోళంలో జరిగే విషయాలు ఎప్పటికీ తెలుసుకోవాలని ఉత్సుకత తో మనిషిని ఎప్పుడూ కలవర పెడుతూనే ఉంటుంది అందులో భాగంగానే సంపూర్ణ చంద్ర సూర్యగ్రహణాలు ఏర్పడతాయనే సందర్భంలో అనేక ప్రాంతాలలో వివిధ రూపాలలో మూఢనమ్మకాలు ప్రజలలో విస్తృతంగా ఏర్పడుతున్నాయి. ఆ క్రమంలోని కీడు, శకునం అనే పేరుతో ప్రజలు తమ ఆదాయాలని ఈ వదంతులకు ఖర్చు పెడుతూ నిజానిజాలు తెలుసుకోకుండా శాస్త్రీయ అవగాహన లేకుండా మరీ మారుమూల ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. సంపూర్ణ చంద్రగ్రహాన్ని ప్రజలందరూ ఖగోళ అద్భుతాలను వీక్షించవచ్చని ఏ రకమైన ప్రమాదాలు లేవని తగిన శాస్త్రీయ అంశాలను జోడిస్తూ విద్యార్థులని చైతన్యం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటి రామ్ చందర్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మాదాసు అఖిల్, సిఐటియు నాయకులు కొమరం కాంతారావు, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు చర్ప సత్యం తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram