లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని భట్టుపల్లి సెంటర్ వద్ద గల కొమరం భీమ్ విగ్రహానికి సోమవారం మండల ఆదివాసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుప్రీం కోర్టు లో కేసు వేసిన తెల్ల వెంకటరావు సోయం బాపురావు ఫోటోలకు పాలాభిషేకం చేసి కరకగూడెం మండలం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్న కలెక్టర్ ను కలిసి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాల  వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుండి  కరకగూడెం మండల కేంద్రానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ ఆదివాసీ సమాజంపై చేసిన అనుచిత వ్యాఖ్యలును ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. తరువాత మండల తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్‌గారికి కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సమాజ హక్కుల పరిరక్షణ కోసం ఎలాంటి వెనుకడుగు ఉండదని, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తప్పించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు విషయంలో లంబాడి నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మండల జేఏసీ ఖండించింది. వారి వైఖరికి వ్యతిరేకంగా లంబాడి నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు.

 

ఆదివాసి జేఏసీ నాయకుల డిమాండ్స్..

➡️ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి వెంటనే తొలగించకపోతే జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని  డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రోడ్లపై కి వచ్చి పెద్దఎత్తున ర్యాలీలు, ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకుల ప్రజా ప్రతినిధులుయువతతో పాటు ఆదివాసీ సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram