ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత మృతి చెందినట్లు తెలిసింది. ఒడిశా రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ ఈ ఎన్కౌంటర్లో మరణించినట్లు సమాచారం. పది మంది మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం తెలిసి భద్రతాదళాలు పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. దానా మొయినాపూర్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది.

అయితే భద్రతాదళాలు గాలింపు చర్యలు చేస్తుండగా మావోయిస్టుల కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. అయితే పది మంది మావోయిస్టులు మరణించగా వారి నుంచి భారీగా ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా అంటున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram