గోల్డెన్ న్యూస్/ మణుగూరు : పోలీసులు తెలిపిన ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మణుగూరు మండలంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ పరిసరాల్లోని ఓ ఫంక్షన్ హాల్లో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు మణుగూరు సిఐ నాగబాబు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో 15 మంది వ్యక్తులు పేకాట ఆడుతూ దొరికారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు, 6 మోటార్ సైకిల్, పేక ముక్కలు, రెండు కార్లు, రూ. 1, 69,520 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు .
Post Views: 241









