చేపల వల కి చిక్కిన కొండచిలువ

గోల్డ్ న్యూస్  /పినపాక :  చేపల వేట కోసం చెరువు మత్తడి వద్ద ఏర్పాటుచేసిన వలకు పొడవైన కొండచిలువ చిక్కింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక చెరువు మత్తడి వద్ద చెరువు లో పోసిన చేప పిల్లలు బయటకు వెళ్లకుండా ఆ చెరువుకు సంబంధించిన వ్యక్తులు వలను ఏర్పాటు చేశారు. అయితే ఆవలకు కొండచిలువ చిక్కింది అటుగా వెళుతున్న వారు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన   గోపాలరావు పేట బీట్ అధికారి వజ్జా ఆదిత్య ఆధ్వర్యంలో వాచర్ లు అశోక్ రాంబాబు, స్థానికుల సహాయంతో కొండచిలువకు కు హాని జరగకుండా జాగ్రత్తగా వల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఓ సంచిలో బంధించి గోపాలరావుపేట అడవుల్లో వదిలిపెట్టినట్టు  అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వజ్జా ఆదిత్య మాట్లాడుతూ. చేపల కోసం వచ్చి వలకి చిక్కిందని ఆయన తెలిపారు. ఇవి విషం లేని పాములని వీటిని ప్రజలు చంపకూడదని తెలిపారు. తమకు సమాచారమిస్తే వాటిని బంధించి అడవిలో వదిలేస్తామని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram