విషాదం.. నీటిగుంతలో పడి నలుగురు మృతి

గోల్డెన్ న్యూస్ /  వాంకిడి : కుమురం భీం జిల్లా వాంకిడి మండలం డాబా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ నీటిగుంతలో పడి తల్లి, ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

పోలీసుల కథనం ప్రకారం.. మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో నీటి కోసం మోర్లే గన్ను(12), వాడే మహేశ్వరీ(9), అదే శశికళ(9) ముగ్గురు పిల్లలు కుంటలో దిగారు. కుంటలో లోతు ఎక్కువగా ఉండటంతో.. చిన్నారులు నీటిలో మునిగిపోయారు. అది గమనించిన మహిళ మోర్లే బుజ్జి బాయి (35) చిన్నారులను రక్షించేందుకు నీటిగుంతలోకి దిగింది. గుంతలో నీరు, బురద ఎక్కువగా ఉండటంతో నలుగురు నీటిగుంతలోనే చిక్కుకుని మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram