భర్త పై భార్య పోలీసులకు ఫిర్యాదు
రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా పోలీస్ యంత్రాంగం గజ ఈతగాళ్లు
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్, అనారోగ్యంతో బాధపడు తున్న మూడేళ్ల కుమారు డిని ఓ తండ్రి చంపేశాడు. సంచిలో మూటకట్టి మూసీలో విసిరేశాడు. ఏసీపీ సుధాకర్ వివరాల ప్రకారం… బండ్లగూడ నూరినగర్కు చెందిన మహ్మద్ అక్బర్ (35), సనాబేగం దంపతులకు పెద్దకుమారుడు(1), రెండో కుమారుడు మహ్మద్ అనాస్(3) ఉన్నారు. అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. సనాబేగం నిలోఫర్ కేర్ టేకర్‌గా చేస్తోంది. చిన్నకుమారుడు అనారో గ్యంతో బాధపడుతున్నాడు. దీనిపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. దీంతో కన్నబిడ్డను చంపాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్లాక తెల్లవారుజామున అనాస్ తలపై దిండుతో ఊపిరాడకుండా చేశాడు. సంచిలో మృతదేహాన్ని కుక్కి బైక్‌పై తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జి మీద నుంచి మూసీలో విసిరాడు. ఉదయం ఠాణాకు వెళ్లి తన బిడ్డ కని పించడం లేదని ఫిర్యాదు చేశాడు. బంధువులు తీసుకెళ్లి తన ఇంటి దగ్గర దింపినట్లు ఫోన్ చేశారు.. అప్పటినుంచి కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు. అక్బర్‌పై అనుమానంతో ఫోన్ పరిశీలించగా ఎలాంటి కాల్స్ రాలేదు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా అక్బర్ తన కొడుకుని తీసుకెళ్తున్నట్టు రికార్డయింది









