ఎలుకతో జోస్యం’…అవును మీరు చదివేది నిజమే – ఎక్కడో తెలుసా!

ఇన్ని రోజులు మనిషి జోష్యం ..చిలక జోస్యం… నాడీ జోష్యం … దేవుళ్ళ పేర్లతో జోస్యం.. ఇలా అన్ని విన్నం..చూసాం.. కానీ ఎలుకతో జోస్యం’…అవును మీరు చదివేది నిజమే – ఎక్కడో తెలుసా!

తమ భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకునేందుకు చాలామంది జ్యోతిష్యం చెప్పించుకుంటారు.

ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరుగుతాయా?

తమకు ఏవైనా ప్రమాదాలు సంభవించనున్నాయా?

ఇలా మంచైనా, చెడైనా తెలుసుకునేందుకు జోస్యం ఒక మార్గమని చాలామంది నమ్ముతారు

 

ఇప్పటి వరకు చిలుక జోస్యం ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అదే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ వేరే జంతువులు ఏవైనా జోస్యం చెప్పడం మీరు చూశారా? అని అడిగితే లేదు అనే సమాధానం చెప్తారు చాలా మంది. కానీ ఎలుక కూడా జోస్యం చెప్తుందని మీకు తెలుసా? నమ్మలేకపోతున్నారా? అయినప్పటికీ ఇదే నిజం. చిత్తూరు జిల్లాలోని ఒక ఆలయంలో ఎలుక జోస్యం ఎంతో ప్రత్యేకం. అసలు ఎలుక ఏంటి? జోస్యం చెప్పడమేంటి అనుకుంటున్నారా? ఆ ప్రత్యేకమైన మూషికం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

 

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం అంజేరమ్మ ఆలయం వద్ద ‘ఎలుక జోస్యం’ చెప్పడం పలువురిని ఆకట్టుకుంటోంది. నారాయణవనం గ్రామానికి చెందిన సిద్ధముని 30 ఏళ్లుగా చిలుక జోస్యం చెబుతున్నారు.

 

అయితే ఏడాది క్రితం అతడు చెన్నై వెళ్లినప్పుడు అక్కడ ఎలుకతో జోస్యం చెప్పడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అక్కడి నుంచి శిక్షణ పొందిన ఎలుకను తీసుకొచ్చారు. కొంతకాలం మచ్చిక చేసుకున్న తర్వాత స్థానిక ఆలయం వద్ద ఎలుక జోస్యం చెప్పడం ప్రారంభించారు. ఈ మూషికం పేరు గణేశ్‌ అని, ఎలుక వినాయకుడి వాహనం కావడంతో ఎక్కువ మంది జోస్యం చెప్పించుకుంటున్నారని సిద్ధముని పేర్కొంటున్నారు.

 

మనిషి జీవితంలో జరిగిందీ, జరుగుతుంది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారం, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని జోస్యం చెప్పారు. హిందూ సాంప్రదాయాల, విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. అంజేరమ్మ ఆలయంలో ఎలుక జోస్యంతో తమకు మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతున్నట్లు తెలుపుతున్నారు. జోస్యం చెప్పే ఎలుక పేరు గణేశ్ కావడంతో సాక్షాత్తూ విఘ్నేశ్వరుడి వాహనమైన మూషికం తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని విశ్వసిస్తున్నారు భక్తులు.

Facebook
WhatsApp
Twitter
Telegram