ఓరి మీ వేషాలు తగలెయ్య…..పేకాట కోసం ఎక్కడా స్థలం లేనట్టు నది మధ్య లోకి వెళ్లారు….ఇంకేముంది ఒక్కసారిగా వరద రావడం తో …పేకాట గీకట జంతా నై… మా ప్రాణాలు కాపాడిండి మహా ప్రభో అని వేడుకున్నారు…చివరికి!
గోల్డెన్ న్యూస్ / నెల్లూరు : నల్లూరులోని భగత్ సింగ్ కాలనీ వద్ద ఉన్న పెన్నా నదిలో పది మంది యువకులు చిక్కుకుపోయారు.
పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లారు.
సోమశిల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో ఒక్కసారిగా నదిలో నీరు చుట్టుముట్టింది.
దీంతో ఆ పది మంది అక్కడే చిక్కుకుపోయారు.
స్థానికులు సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా వారిని బయటికి తీసుకొచ్చారు.
Post Views: 50









