అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి సర్కారు కసరత్తు

 15,274 ఉద్యోగాలు గుర్తింపు

గోల్డెన్ న్యూస్/  హైదరాబాద్ :తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నియామక విధానంలో మార్పులు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేయనున్నారు, దీని ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపడతాయి.

తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణ కారణంగా ఏర్పడిన మొత్తం 15,274 ఖాళీలను గుర్తించారు. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియామక విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రస్తుతం ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

అంగన్వడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా పోషకాహారం పంపిణీ, పూర్వప్రాథమిక విద్య వంటి కీలక సేవలు సక్రమంగా అందడం లేదు. సహాయకులు లేకపోవడంతో పోషకాహారం అందించడంలో సమస్యలు, అలాగే టీచర్లు లేనిచోట విద్యార్థులకు ప్రాథమిక విద్య అందడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram