హైదరాబాద్‌లో వరదల్లో గల్లంతైన ముగ్గురు వ్యక్తులు మల్లేపల్లి – అఫ్జల్ సాగర్ కాలనీలో నివాసం ఉండే అర్జున్, రాము వరుసకు మామ, అల్లుళ్ళు.. వీరికి పెళ్లి అవ్వగా నలుగురు, నలుగురు పిల్లలు
రోజులాగే ఇంటి బయట మంచాలపై పడుకున్న అర్జున్, రాము
అకస్మాత్తుగా వచ్చిన వరద వల్ల నాలాలో పడిపోయి గల్లంతైన ఇద్దరు
ముషీరాబాద్ – వినోబా నగర్ ప్రాంతానికి చెందిన దినేష్ ఒక అనాధ యువతిని ప్రేమ వివాహం చేసుకోగా, వీరికి మూడేళ్ల కుమారుడు
స్నేహితుడి ఇంటి దగ్గరికి వెళ్ళి, బైక్ ను పార్క్ చేస్తుండగా నాలా గోడ కూలి వరదలో కొట్టుకుపోయిన దినేష్
కొడుకు తిరిగొస్తాడనే నమ్మకంతో వరదలో కొట్టుకుపోయిన విషయం కోడలికి చెప్పని దినేష్ తల్లిదండ్రులు
విషయం వార్తల్లో తెలుసుకొని గుండెలవిసేలా రోదించిన దినేష్ భార్య
Post Views: 36









