ముఖ్యమంత్రికి రూ.2 కోట్ల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మంగళవారం మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన 2 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

 

కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న నిధులను రైతుల కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు నల్గొండ లోక్‌సభ సభ్యుడు కుందూరు రఘువీర్ గారిని వెంటబెట్టుకుని ముఖ్యమంత్రిని కలిసి, ఈ మొత్తం మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలకే వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు.

 

 

ప్రత్యేకంగా, దాదాపు ఒక లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక యూరియా బస్తా ఉచితంగా అందే విధంగా ఈ నిధులను వినియోగించాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగత వేడుకను త్యజించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమానికి నిధులు మళ్లించిన లక్ష్మారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందిం

చారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram