ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోభా నగర్లో ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం
గోల్డెన్ న్యూస్ / ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పి చంద్రభాను ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోభా నగర్లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా మొత్తం సుమారుగా 250 ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. సరిగా పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేని 70 ద్విచక్ర వాహనాలను,03 ఆటోలను,ఒక కారును సీజ్ చేయడం జరిగింది.అనంతరం వినోభా నగర్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇల్లందు డిఎస్పి చంద్రభాను పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక మరియు సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.మట్కా,జూదం,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు.విపత్కర సమయాల్లో ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను పొందాలని తెలిపారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాలలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.










