తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Post Views: 32









